భారత్ న్యూస్ విజయవాడ…కర్ణాటకలో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్
అట్రాసిటీ కేసులో 98 మందికి జీవిత ఖైదు
కర్ణాటక :
దళిత వర్గానికి చెందిన వారిపై దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు విధించింది.
మరకుంబిలో తమ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారని ఆగస్టు 28, 2014లో అగ్రకులస్థులు సామూహికంగా దళితులపై దాడి చేసి వారి నివాసాలకు నిప్పుపెట్టారు.
ఈ కేసులో కోర్ట్ 98 మంది నిందితులకు యావజ్జీవం, SC, ST వర్గానికి చెందిన మరో ముగ్గురు ముద్దాయిలకు ఐదేళ్లు కఠిన శిక్ష విధించింది.