భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు

AP: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామోలిన్ లీటర్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.124 చొప్పున అమ్మనున్నట్లు చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున తక్కువ ధరలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఒకే ధరకు అమ్మాలని వ్యాపారులకు సూచించారు.