వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన రెవిన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో పాకాల జడ్పిటిసి నంగా పద్మజా బాబు రెడ్డి,తాసిల్దార్ నిత్యానంద బాబు,ఎంపీడీఓ అరుణ,ఈఓపిఆర్డి శశిరేఖలు హాజరయ్యారు.రెవెన్యూ సదస్సులో పాల్గొనటానికి వల్లివేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం నాయకులు,కార్యకర్తలు,అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతుల సమస్యల పరిష్కారానికి”మీ భూమి-మీ హక్కు”రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు,ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వమన‌్నారు.సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని అన్నారు.గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురి చేసింది అన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేసిందని గుర్తు చేశారు.మీ భూమి-మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్(ప్రొహిబిషన్)యాక్ట్-2024ను ప్రవేశపెట్టామని,దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేసిందన్నారు.రైతులకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిదని,ప్రతీ కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా,ఒక ఆస‌్తి,ఒక భవిష్యత్తు ఆధారమని వివరించారు.ముఖ్యంగా రెవిన్యూ సదస్సు తూతూ మంత్రంగా చెయడం లేదు.ఇప్పుడు ఇచ్చిన వినతులు 3 నెలల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.మండల స్థాయిలో రెవిన్యూ సదస్సు వినతులు పరిష్కారం కాకపోతే ఆర్డీవో,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవిధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తలపెట్టారని,దానికి అనుగుణంగా గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదని,ప్రభుత్వమే(అధికారులు)ప్రజల వద్దకు వచ్చి సమస్య పరిష్కరించాలనేది రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని చెప్పారు.రైతు యొక్క సమస్యలు,భూ కొలతల్లో తేడాలు,సర్వే నెంబర్లలో మార్పులు,వారసత్వం పేర్ల నమోదు,సరిహద్దు సమస్య,భూ విస్తీర్ణంలో తేడాలు,రీసర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు,కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు,అసైన్డ్,చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారని వివరించారు.గత ప్రభుత్వం అహంకారంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించుకుని ఆనందం పొందాలని చూసిన గత పాలకులు.కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పాసు పుస్తకాలను రద్దు చేసి,కూటమి ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం,గత ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో సుమారు 1లక్ష 14 వేల ఎకరాల ప్రజల భూమిని గత ప్రభుత్వం లోని ఎమ్మెల్యేలు,మంత్రులు ఫ్రీ హోల్డ్ లాండ్స్ పేరుతో అమ్ముకోవడం జరిగిందని తెలిపారు.వాటి విలువ సుమారు 20 వేల కోట్లు అని పేర‌్కొన‌్నారు.గత ప్రభుత్వం హయాంలో భూ సర్వే పేరుతో రాళ్ళు నాటడానికి సుమారు 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే,గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,సిబ్బంది,ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.