టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి నేండ్రగుంట వద్ద ఘన స్వాగతం పలికిన పాకాల మండల టిడిపి కుటుంబ సభ్యులు
పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట వద్ద టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి మండల టిడిపి నాయకులు,మహిళ నాయకురాలు,టీడీపి కుటుంబ సభ్యులు,పాకాల జడ్పిటిసి నంగా పద్మజాబాబు రెడ్డిలు కలిసి మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.తిరుపతి విమానాశ్రయం నుండి నేండ్రగుంట మీదుగా స్వగ్రామం దిగువ పూలేపల్లికి టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడు వెళ్తుండగా మార్గమధ్యంలో నేండ్రగుంట వద్ద టిటిడి బోర్డు చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,మాజీ ఎంపీపీ చాముండేశ్వరి,చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి,బొల్లినేని మహేష్,సోంపల్లి ఉమాపతి నాయుడు,పాటూరు మోహన్,స్థానిక టిడిపి నేతలు శ్యాలువ కప్పి,పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.బుధవారం ఉదయం టిటిడి పాలక మండలి ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.