..భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!.
ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు
కేటాయించడంతో ఏపీ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు
పంపింది.
నిబంధనల మేరకు 10 ఎకరాల కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం,నిర్వహణ ESI కార్పొరేషన్ కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు.
తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.