భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీలో 5,423 గ్రామాల్లో సెల్ సిగ్నల్ సమస్యకు చెల్లు!

ఏపీలో మారుమూల గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త సెల్ టవర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

రాష్ట్రంలో 5,423మారుమూల ప్రాంతాలకు 4జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇందుకోసం 2,271లొకేషన్లలో టవర్ల ఏర్పాటుకుఅవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డీవోటీ) కు
స్వాధీనం చేసింది.