భారత్ న్యూస్ విజయవాడ…పడమటిగూడెంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్..

డోర్నకల్ నియోజకవర్గంలో దంతాలపల్లి మండలంలోని పడమటిగూడెం గ్రామంలో శ్రీబాలాజీ కాటన్ మిల్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్…, అనంతరం రైతులు తెచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. డాక్టర్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ పత్తి వేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు పత్తిలో తేమ శాతం బట్టి ధరలు నిర్ణయిస్తారు, సీసీఐ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.