భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

Oct 20, 2024,

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై బెంగళూరుకు చెందిన శశికుమార్ కేసు పెట్టారు. బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వాదం కోసం రూ.65 వేలు తీసుకుని మోసం చేశారని శశికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.