భారత్ న్యూస్ విజయవాడ…బ్రాహ్మణులు శాకాహారులుగా మారుటలో వారి దురాలోచన?

Source from: who are shudras
✍🏽Dr.B.R.Ambedkar,
Writings and speeches, Volume no: 7, page no:324,325

జంతుబలి మంచిది కాదని బ్రాహ్మణులు విశ్వసించినట్టయితే యజ్ఞాల పేరిట జంతు ఇవ్వడం మానుకుంటే సరిపోయేది. ఇందుకు వారు శాకాహారులు కానవసరం లేదు. వారు శాకాహారులయేందుకు నిశ్చయించుకున్నారంటే వారు దూరాలోచన చేశారన్నది స్పష్టం. ఇక, వారు శాకాహారులు నిజానికి కానవసరంలేదు. బౌద్ధ భిక్షువులు శాకాహారులు కాదు. ఐతే అనేకమందికి ఈ మాట ఆశ్చర్యం కలిగించవచ్చు. సాధారణంగా అహింస, బౌద్ధమతం విడదీయరానివని భావిస్తుంటారు. బౌద్ధభిక్షువులు మాంసాహారాన్ని నిరసిస్తారనీ భావిస్తుంటారు. సాధారణంగా ఇది పొరబాటు. వాస్తవానికి బౌద్ధభిక్షువులు పవిత్రమైనవని పేర్కొన్న మూడు రకాల మాంసాన్ని తినవచ్చు. ఆ తరువాత ఐదు రకాల మాంసాలను తినవచ్చని నిబంధనను విస్తృతం చేసుకున్నారు. చైనా నుంచి వచ్చిన నాటి పర్యాటకుడు యు ఎన్జంతుబలి మంచిది కాదని బ్రాహ్మణులు విశ్వసించినట్టయితే యజ్ఞాల పేరిట జంతు ఇవ్వడం మానుకుంటే సరిపోయేది. ఇందుకు వారు శాకాహారులు కానవసరం లేదు. వారు శాకాహారులయేందుకు నిశ్చయించుకున్నారంటే వారు దూరాలోచన చేశారన్నది స్పష్టం. ఇక, చారు శాకాహారులు నిజానికి కానవసరంలేదు. బౌద్ధ భిక్షువులు శాకాహారులు కాదు. ఐతే అనేకమందికి ఈ మాట ఆశ్చర్యం కలిగించవచ్చు. సాధారణంగా అహింస, బౌద్ధమతం విడదీయరానివని భావిస్తుంటారు. బౌద్ధభిక్షువులు మాంసాహారాన్ని నిరసిస్తారనీ భావిస్తుంటారు. సాధారణంగా ఇది పొరబాటు. వాస్తవానికి బౌద్ధభిక్షువులు పవిత్రమైనవని పేర్కొన్న మూడు రకాల మాంసాన్ని తినవచ్చు. ఆ తరువాత ఐదు రకాల మాంసాలను తినవచ్చని నిబంధనను విస్తృతం చేసుకున్నారు. చైనా నుంచి వచ్చిన నాటి పర్యాటకుడు యు ఎన్ త్సాంగ్ ఈ వివరాలు తెలుసుకుని శుద్ధమైనవిగా పేర్కొనే మాంసాన్ని ‘పాన్- చింగ్’ గా వర్ణించాడు. బౌద్ధభిక్షువు ఆహార విధానాన్ని గురించి థామస్ వాల్టర్ ఇలా విపులంగా వివరించారు”.

“బుద్ధుని కాలంలో వైశాలి నగరంలో బౌద్ధమతం పుచ్చుకున్న ‘సిహా’ అనే సంపన్న దుండేవారు. ఆయన భిక్షులను యథేచ్ఛగా సమర్థించేవారు. వారికి పదా స్వచ్ఛమైన మాంసాహారాన్ని పంపించేవాడు. బౌద్ధ భిక్షువులు ఈ విధంగా తమకు పంపిన మాంసాన్ని తినడం అలవాటు చేసుకున్నారని విదేశాలలో ప్రజలకు తెలిసింది. దీని పై ‘తీర్థికలు’ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌద్ధభిక్షువులకు ఈ సంగతి తెలిసి తమ పరిస్థితిని బుద్ధునికి నివే దించారు. ఆయన భిక్షువులనందరిని పిలిపించి తమకోసం తమ ఎదుట చంపిన జంతువు మాంసాన్ని తినవద్దని లేక తమకోసం అటువంటి మాంసం తేవడం జరిగిందని విన్నా ఆమాంసం ముట్టవద్దనీ ఒక శాసనంగా ప్రకటించాడు. కానీ భిక్షువులకు తెలియకుండా, తెలువకుండా, వారు వినకుండా, చూడకుండా జంతువుని చంపి పంపించిన మాంసాన్ని విశుద్ధమైన మాంసంగా పేర్కొని, దానిని మాత్రం తినవచ్చని బుద్ధుడు అనుమతించాడు. అసలు భిక్షువులు తమకోసమే చంపిన ఒక జంతువు మాంసం అని కూడా వారికి అనుమానం కలగ కూడని స్థితిలో వచ్చిన మాంసాహారాన్నే తినవచ్చని కూడా ఆయన చెప్పాడు. పాలి, సూఫెన్లలోని వినయపిటక ప్రకారం సిహాబుద్ధునికి, కొందరు భిక్షువులకు ఉదయాహారం కోసం ఒక పెద్ద ఎద్దు కళేబరాన్ని తెప్పించాడని తెలియడంతో వర్గం ధులు భిక్షువులను దూషించారు. అపుడు బుద్ధుడు కొత్త శాసనం చేస్తూ మూడు విధాల స్వచ్ఛమైన మాంసాన్ని, చేపలను భోజనార్ధాలని ప్రకటించాడు. వాటి నుంచి భిక్షువులకు అనుమతించిన ఆహారాన్ని ‘శుద్ధత్రయం’ గాను ‘మూడు రకాల స్వచ్ఛమైన మాంసం గానూ’ వర్ణించేవారు. దీనికే ‘చూడబడనివి, వినబడనివి, అనుమానింపబడనివి’ గా వర్ణించేవారు. లేక, చైనా అనువాదంలో ఒక్కొక్కసారి దీనిని “నాపైనావిగా చూడని, వినని, అను మానించని” అని వర్ణించి ఉంది. ఆ తరువాత మరి రెండు రకాల మాంసాహారాలను భిక్షువులు తినవచ్చని ప్రకటించారు. అవి సహజంగా మరణించిన జంతువులమాంసం, క్రూర మృగాలుగాని, పక్షులు గాని తమ చేతిలో చంపి వేసిన జంతువుల మాంసం గాని కావచ్చు. ఆ విధంగా ఐదు రకాల మాంసాన్ని విభజించి వర్ణించేలాగా బౌద్ధులు తమ స్వేచ్ఛానుసారం వాటిలో ఆహారంగా తీసుకోనవచ్చు. ఒక ‘చూడబడని, వినబడని, అనుమానించబడని’ తరగతులు ఒకే తరగతి అయి, “సహజమరణం పొందినది’ ‘పశుపక్ష్యాదులుచే చంపబడినవి’ కూడా కలిసి ‘సాన్-విన్’ గా పేర్కొనడం జరిగింది.”

బౌద్ధ భిక్షువులు మాంసాహారం స్వీకరిస్తుండగా బ్రాహ్మణులు మాంసాహారాన్ని విడిచి పెట్టడం నిర్హేతుకం. ఐతే మరి బ్రాహ్మణులు మాంసాహారం విడిచి శాకాహారులెందు కయ్యారు? దీనికి కారణం బౌద్ధు భిక్షువుల వలె, వారిననుసరించే తాము మారినట్టు ప్రజాదృష్టిలో పడకుండా ఉండాలి.