.భారత్ న్యూస్ అమరావతి..కుక్క లేదా పాము కరిచిందా?
కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్న్ 15400 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా. 6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.