భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,BIG ALERT: తుఫాన్ ముప్పు.. 5 రోజులు వర్షాలు
AP: అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని IMD వెల్లడించింది. ఇది 23వ తేదీకి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో నేటి నుంచి 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో 24-26 మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వివరించింది. ఈ నెల 29న, NOV 3న కూడా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందంది.,