భారత్ న్యూస్ ప్రతినిధి::: ఏలూరు జిల్లా కైకలూరు:::: విజయవంతమైన మహా అన్న సమారాధన కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్దింట్ల అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు అత్యద్భుతంగా నిర్వహించారు పెద్దింట్లమ్మ, జలదుర్గ అమ్మవార్లకు గోకర్ణేశ్వరస్వామి కళ్యాణం వైభవముగా నిర్వహించారని,అమ్మవార్లు స్వామివారితో కలసి కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులందరికి దర్శనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారని చుట్టుపక్కల గ్రామస్తులు,దాతల సహాయంతొ అందరూ కలిసి ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం అగుట చేత భక్తి శ్రద్దలతో మహా అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమంనిర్వహించారని భక్తులు వేలాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ప్రజలందరికీ అమ్మవార్ల స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలియజేశారు