భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 108 (అత్యవసర వైద్యం), 104 (సంచార వైద్యం) సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ రెండు సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందంటూ ఎన్డీయే ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందాయి.
నిర్వహణ దారుణంగా ఉందని నిఘా సంస్థలూ ప్రభుత్వానికి నివేదించాయి. బాధ్యతల నుంచి తమకు తాముగా తప్పుకోవాలని లేదంటే తనకు ఉన్న అధికారాల్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి స్పష్టం చేసింది.