భారత్ న్యూస్ విజయవాడ…యూపీలో దారుణం.. ఐదేండ్ల బాలికపై అత్యాచారం
Oct 20, 2024,
యూపీలో దారుణం.. ఐదేండ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఐదేండ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు మైనర్ బాలురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలియా జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుది. నిందితులను అరెస్టు చేశామని పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్, పోక్సో కింద నిందితులపై కేసు నమోదు చేశారు.