..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం..
పలాసలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
పలాస రైల్వే స్టేషన్ లో మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిను తరలించేందుకు రైల్వే ప్లాట్ఫారం పై వేచి ఉన్న ముగ్గురు వ్యక్తులను పలాస జీఆర్పి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద ఉన్న సుమారు 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మీడియాతో ఆదివారం తెలిపారు.