పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, శాలువలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి
పాకాల( భరత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యులు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్బంగా నవంబరు 9వ తేదీ శనివారం ఆయన స్వగ్రామం తుమ్మలగుంటలో అందరికీ అందుబాటులో ఉంటామని .ఆయనను కలవాలనుకునే నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, శాలువలకు బదులుగా నిరు పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలిపారు