..భారత్ న్యూస్ అమరావతి.
ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది.
పెళ్లయిన కూతురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదని హై కోర్ట్ తెలిపింది. ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని కోర్టు స్పష్టం చేసింది.