.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు.
ఏపీలో ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహ దారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మొత్తం 95,208 మంది
ఉత్తీర్ణులయ్యారు.
కానీ రెండో దశ కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11
నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.