..భారత్ న్యూస్ అమరావతి..రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికి ఉండగానే కొడుకు, కూతురుకు ఆస్తులు పంపకాలు చేసారు.
విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ, బైరటీస్ మినరల్స్ స్టాక్స్, సరస్వతీ పవర్, ఎస్‌ఆర్‌ఎస్ హైడ్రో, ఇడుపులపాయ 51 ఎకరాలు, చెట్టి గుంట 79 ఎకరాలు, పులివెందుల 7.6 ఎకరాలు, రోడ్‌నెంబర్ 2 బంజారా హిల్స్ లో ఇల్లు, రాజ్ యువరాజ్ థియేటర్స్ షర్మిలగారికి రాజశేఖర్ రెడ్డిగారు పంచి ఇచ్చిన ఆస్తులు.
జగన్ గారి దక్షత వల్ల తన వాటాకు వచ్చిన ఆస్తులను ఆయన పెంచుకున్నారు.
సాక్షి కోసం రూ.1400 కోట్లు అప్పులు చేసారు.
మొదట్లో ఏటా రూ.20 కోట్ల నష్టాలను సాక్షి భరించింది.
వీటిల్లో షర్మిలమ్మ ఎప్పుడైనా భాగస్వామిగా ఉన్నారా? షర్మిలమ్మకు నచ్చిందనో, కావాలనో అంటే చార్మినర్, తాజ్‌మహల్, విప్రో, రిలయన్స్ ఇచ్చేయమంటారా..?
-విజయసాయిరెడ్డి గారు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్…