భారత్ న్యూస్ విజయవాడ…ఏరులై పారుతున్న మద్యం..ఇదేనా గ్రమస్వరాజ్యం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాంద్రప్రదేశ్‌గా మారిపోయింది రాష్ట్రం. జగన్ సర్కార్ రద్దు చేసిన బెల్టు షాపులను తిరిగి ఓపెన్ చేయడమే కాదు బహిరంగంగానే వేలంపాటలో దక్కించుకనేందుకు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది.
పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే సంత మార్కెట్లలో సైతం మద్యం దొరుకుతుండటం విశేషం. ఎమ్మెల్యే, స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో బెల్టు షాపుల కేటాయింపు జరుగుతుండగా క్వార్టర్ ఆటిల్‌కు రూ. 20 నుండి రూ.30 వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
మద్యం వ్యాపారులు ఇదే అదునుగా షాపు లైసెన్స్ ఫీజు రాబట్టుకోవడంతో పాటు భారీగా లాభాలు అర్జిస్తుండగా ప్రజల ప్రాణాలు మాత్రం పోయే పరిస్థితి నెలకొంది. విచ్చల విడి మద్యంతో శాంతి భద్రతలు దెబ్బతినే పరిస్థితి నెలకొనగా మహిళలు, పిల్లల ప్రాణాలకు రక్షణేది అని ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.