భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
Oct 22, 2024,
ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. సోమవారం ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని ‘వెరీ పూర్ (Very poor)’ కేటగిరీగా వర్గీకరించింది. వాయు కాలుష్యం కారణంగా నగరంపై దట్టంగా పొగ మంచు కమ్మి ఉంటోంది. దాంతో ఉదయం పూట వాహనదారులు రోడ్లపై విజిబిలిటీ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.