..భారత్ న్యూస్ అమరావతి,
: అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమికి కీలక బాధ్యతలు

Oct 22, 2024,

అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమికి కీలక బాధ్యతలు
ప్రముఖ సీనియర్‌ నటి గౌతమికి అన్నాడీఎంకేలో కీలక పదవి దక్కింది. గౌతమి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి అన్నాడీఎంకేలో చేరారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉప ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సోమవారం ప్రకటించారు.