అభివృద్ధిలో నియోజకవర్గo ముందుండేలా పనిచేయాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల ( భారత్ న్యూస్ ) చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనసభ్యులు పులివర్తి నాని కోరారు. శనివారం పాకాల మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతి సమస్యను కాల పరిమితిలో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజలు తీసుకొచ్చి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. ఎంపీపీ లోకనాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు మంచి పేరు తీసుకొచ్చేలా అధికారులు ప్రోటోకాల్ అమలు చేయాలని కోరారు. పాకాల నుండి చిత్తూరు వెళ్లే ఆర్టిసి బస్సు గురుకుల పాఠశాల మార్గంలో వెళ్లేలా చేయాలని కోరారు. జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా లేని అభివృద్ధి ఈ మూడు నెలల కాలంలోనే జరుగుతోందని ఇది హర్…