చిత్తూరు జిల్లా ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన శ్రీ ఆర్.శివానంద కిషోర్.

బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, ఐపియస్ గారిని ఎస్.పి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

చిత్తూర్ (భారత్ న్యూస్ ) శ్రీ ఆర్.శివానంద కిషోర్ గారు M.SC., B.Ed మరియు Psychology పూర్తి చేసి 1992 బ్యాచ్ లో ఆర్.ఎస్సైగా పోలీసుశాఖలో చేరారు. మొదటి పోస్టింగ్లో తిరుపతి ఏ.ఆర్. లో ఆర్.ఎస్.ఐ గా పనిచేసిన అనంతరం 2000వ సం.లో ఆర్.ఐ గా పదోన్నతి పొంది చిత్తూరు తిరుపతి లో ఏ.ఆర్. నందు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు విధులు నిర్వర్తించి 2011వ సం.లో డిఎస్పీ గా చిత్తూరు లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ గా మరియు PTC కళ్యాణి డ్యాం లోను వైస్ ప్రిన్సిపాల్, తిరుమలలో విజిలెన్సు అధికారిగా పనిచేసి ఇప్పుడు ప్రమోషన్ మీద చిత్తూరు జిల్లా ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ గా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏ.ఆర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా అడిషనల్ ఎస్.పి గారిని కలిసారు.