భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.కొట్లాట కేసులొ నిందితులు అరెస్టు

నిందితుల్లో ఒక వ్యక్తిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలదు

గతంలో వీరిపై తాడేపల్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు

మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ వెల్లడి

ఈనెల 18 వ తారీకు అర్ధరాత్రి 1:00 సమయంలో ఎర్రబాలెం గ్రామానికి చెందిన బెల్లం సురేష్ అను వ్యక్తిని రామచంద్రాపురం కరకట్ట రోడ్డుపై తాడేపల్లి కి చెందిన హరికృష్ణ మరియు విజయవాడ కృష్ణలంక కు చెందిన ఎలిసెట్టి రామకృష్ణ అనే వ్యక్తులు అడ్డగించి అతనిపై దాడి చేసి అతని సెల్ ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయినట్లు ఫిర్యాదురుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన వెంటనే పై తెలిపిన వ్యక్తులను మంగళగిరి రూరల్ పోలీసు వారు అరెస్ట్ చేసి గౌరవ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం హాజరు పరచడమైనది.కావున మండల ప్రజలందరూ ఎటువంటి అల్లర్లకు అఘాయిత్యాలకు పాల్పడకూడదని, పాల్పడిన యెడల వారి పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్టం ముందు అందరూ సమానులే చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట హెచ్చరించారు..