భారత్ న్యూస్ విజయవాడ…ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది.
సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటు పెరిగింది.
దీంతో 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 84,297 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు