…భారత్ న్యూస్ మచిలీపట్నం,జిల్లాలో 20 మినుము, పెసలు కొనుగోలు కేంద్రాలు: JC
జిల్లాలో మినుము, పెసలు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకుగాను మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. పెసలు కొనుగోలుకు సంబంధించి 08, మినుములు కొనుగోలుకు సంబంధించి 12 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మినుము క్వింటాలుకు రూ.7,400లు, పెసలు క్వింటాలుకు రూ.8,682లు మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.