దాతల సహాయం కోసం ఎదురుచూపులు,,

భారత్ న్యూస్ కోడూరు

దాతల సహాయం కోసం ఎదురుచూపులు

ఊపిరితిత్తులు దెబ్బతినడంతో మంచానికే పరిమితమైన మణికంఠ

రెండు ఊపిరితిత్తుల మార్పిడికి 40లక్షల ఖర్చు అవుతుంది అంటున్నా వైద్యులు

ఉన్న ఇల్లు,బంగారం అమ్మి వైద్యం చేయించిన కుటుంబీకులు

ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకోలు
కుటుంబ పోషణ కోసం ఎంచుకున్న వృత్తి తన ప్రాణాల మీదకు తీసుకువచ్చింది.
కుటుంబం కోసం శ్రమించిన ఆ యువకుడు ప్రస్తుతం కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
కోడూరు లోని వడ్డెర పాలానికి చెందిన 27 సంవత్సర ల వయసుగల బండారు మణికంఠ కుటుంబ పోషణ కోసం 18 సంవత్సరాల వయసులోనే విజయవాడ వెళ్లాడు.
అక్కడ ఓ దుకాణంలో అద్దాల ఫినిషింగ్ పనులు చేస్తూ వచ్చిన రూపాయిని తన ఖర్చులకు వినియోగించుకుని, మిగిలిన డబ్బుల ను ఇంటి అవసరాల కోసం పంపించేవాడు.

ఈ నేపథ్యంలో మణికంఠ వివాహం చేసుకోగా ప్రస్తుతం ఇద్దరు సంతానం ఉన్నారు.
మూడు సంవత్సరాల బాబు, సంవత్సరం పాప ఉన్నారు.

ప్రాణాల మీదకు తెచ్చిన అద్దాల ఫినిషింగ్ పని.

మణికంఠ తన ఎంచుకున్న అద్దాలు ఫినిషింగ్ పనే ప్రస్తుతం తన ప్రాణాల మీదకు తీసుకువచ్చింది.
పనిచేసే సమయంలో అద్దాలపై ఉంచే పొర మొక్క, నోరు ద్వారా మణికంఠ శరీరంలోకి
ప్రవేశించింది. ఇది గమనించని మణికంఠ అక్కడే పని చేస్తూ ఉండగా గత ఏడాది తీవ్రమైన దగ్గు వచ్చింది.
దగ్గరలోని వైద్యుల ను సంప్రదించగా దగ్గు తగ్గడానికి ముందు వాడాడు కానీ అసలు సమస్య గ్రహించలేకపోయాడు .

పూర్తిగా దెబ్బతిన్న ఊపిరితులు

దగ్గు ఎక్కువ అవడంతో మణికంఠ కుటుంబ సభ్యులు మణికంఠను పెద్ద అవుటుపల్లి లోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో చూపించారు.
అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు చేసి మణికంఠ రెండు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మణికంఠకు వైద్యం చేయించేందుకు తండ్రి సుబ్బారావు తనకున్న ఇంటిని, ఇళ్ల స్థలాన్ని తనకా పెట్టారు.
భార్య శిరీష తను తీసుకువచ్చిన కట్నం డబ్బులను కూడా మణికంఠ వైద్య ఖర్చులకు ఉపయోగించారు.
శిరీష తన బంగారాన్ని కూడా అమ్మేసి భర్తను బతికించుకునేందుకు శాయి శక్తుల కృషి చేసింది.
సిద్ధార్థ కళాశాల అనంతరం విజయవాడ,గుంటూరులోని మూడు వైద్యశాలలో మణికంఠ పరిస్థితిని చూపించి అక్కడ వైద్య సలహా కూడా తీసుకున్నారు.

ఊపిరితిత్తుల మార్పిడికి 40 లక్షల ఖర్చు

మణికంఠ రెండు ఊపిరితిత్తులు మార్పిడి చేస్తే గాని బ్రతుకుతాడని వైద్యులు చెప్పారని భారీ శిరీష తెలిపింది.
ఊపిరితులు మార్పిడికి 40 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని,
ప్రస్తుతం తమ దగ్గర అంత స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్తను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేసామని విలపించింది.
ప్రభుత్వం,దాతలు స్పందించి తన భర్త ఊపిరితిత్తుల మార్పిడి సహాయం అందించాలని శిరీష కోరుతుంది.
సహాయం చేసే దాతలు బండారు మణికంఠ పేరు మీద ఉన్న ఫోన్ పే నెంబర్
9640493227 లేదా అకౌంట్ నెంబర్ 38078673486 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ టూ టౌన్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ 00 20343 కు నగదు పంపాలని శిరీష కోరింది.