Headlines

జర్నలిస్టు సమస్యల పరిష్కార దిశగా అడుగులు.

భారత్ న్యూస్ అమరావతి

జర్నలిస్టు సమస్యల పరిష్కార దిశగా అడుగులు.

సమాచార శాఖ మంత్రి పార్థసారధిని కలిసిన ఏపీజేఎఫ్ నాయకులు

అమరావతి: సెక్రటేరియట్ లో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ని ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చీవుల కృష్ణాoజనేయులు బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు, తదితర అంశాలపై మంత్రి తో చర్చించారు.

స్పందించిన సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి త్వరలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు తదితర అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కార దిశగా వేగవంతంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారధిని జర్నలిస్టు శాలువాతో సత్కరించి, మెమెంటో అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నాయకులు కుమార్ రాజా, మట్టుకొయ్య కృష్ణ, అర్ శివ బాబు, జఫ్రుల్లా, చీ వుల రంగారావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.