భారత్ న్యూస్ కోడూరు
లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన
అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులోని శ్రీ దాన శక్తి ఆర్యవైశ్య ప్రార్ధన మందిరం నందు శనివారం లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ వారు 8వ జాబ్ డ్రైవ్ ను టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ అధినేత పూతబోయిన అయ్యప్ప స్వామి మాట్లాడుతూ లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించినదిని 76 మంది నిరుద్యోగ యువతీ యువకులు అవనిగడ్డ నియోజకవర్గ నలుమూలల నుంచి ఈ జాబ్ డ్రైవ్ లో పాల్గొనగా
వీరిలో 38 మంది ఎంపికయ్యారని ఎంపికైన వారికి 45 రోజులు పాటు హైదరాబాదులో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజర్ సునీల్, లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ సభ్యులు బడే నాని, బండే జయ కిషోర్, మాచర్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.