భారత్ న్యూస్ కోడూరు
అనారోగ్య బాధితునికి విక్కుర్తి శ్రీనివాస్ ఆర్థిక సాయం
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ఆర్థిక సాయం అందించారు.
అవనిగడ్డ నియోజకవర్గం లోని కోడూరు మండలంలో గల హంసలదీవి గ్రామానికి చెందిన తూము నాంచారయ్యకు ఆరోగ్య అవసరాల నిమిత్తం రూ. 10 వేల నగదును విక్కుర్తి శ్రీనివాస్ అందించారు.
హంసలదీవి గ్రామానికి చెందిన తూము నాంచారయ్య డయాబెటిక్ వ్యాధితో ఇబ్బంది పడుతూ, కాలుకి సర్జరీ చేయించుకున్నారు.
విషయం తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాస్ శనివారం రూ. 10 వేల రూపాయల నగదును శనివారం బాధితునికి నాంచారయ్యకు అందించారు.
అనారోగ్య కారణాల వలన నాంచారయ్య తన కుటుంబ పోషణతో ఇబ్బంది పడుతున్న నేపద్యంలో విక్కుర్తి శ్రీనివాస్ తన వంతు సాయం అందించారు. భవిష్యత్తులో నాంచారయ్యకు తన వంతు సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విక్కుర్తి శ్రీనివాస్ తెలిపారు.