ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తానని చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు పులివర్తి

ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తా: ఎమ్మెల్యే నాని

పాకాల,( భారత్ న్యూస్ )
ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తానని చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు పులివర్తి నాని స్పష్టం చేశారు. ఆదివారం పాకాల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది తన సొంత మండలం అని, రాబోవు సమావేశం వేళకు అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం పోటీపడేలా పనిచేయాలని, కచ్చ సాధింపులు ఉండవని స్పష్టం చేశారు. పాకాల దామలచెరువు మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని త్వరలో పూర్తి చేస్తానన్నారు. పాకాల రైల్వేస్టేషన్లో లోడింగ్, అన్లోడింగు జరిగేలా ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు తో మాట్లాడాలని మరో నెలలో సమావేశం జరుగుతుందని దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను అన్నారు. అధికారులు గంజాయి నివారణకు అలాగే పక్క రాష్ట్రం నుంచి వచ్చే మద్యాన్ని నిలుపుదల చేయాలని బెల్టు షాపులు నివారించాలని ఆదేశించారు. ట్యాంకులు క్లోరినేషన్ చేసి తాగునీరు కలుషితం లేకుండా చూడాలని, అలాగే మురికి నీరు కాలువలో మురికి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు రాతపూర్వకంగా ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో తీసుకెళ్లేలా కింది స్థాయి అధికారులకు వివరాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని సమస్యలను తెలియజేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను వివరించారు. పాకాల ఎంపీపీ లోకనాథం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, ఎంపీడీవో నాగేంద్రబాబు,తహసిల్దార్ నిత్యానంద బాబు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నా