Headlines

పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్.

భారత్ న్యూస్ తాడేపల్లి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం.

పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్.

 • ఈవిఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి.
 • పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టిడిపి ప్రచారం చేసుకుంటోంది.
 • ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు.
 • చంద్రబాబు వైరస్ తో ఎన్నికల కమీషన్ ఇన్ ఫెక్ట్ అయింది.
 • బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదు.
 • నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
 • అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చు.
 • బీజేపీ తో చంద్రబాబు పొత్తు తర్వాత బాబు కి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోంది.
 • మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు.
 • ఈవిఎంల ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో ఈసి చెప్పడం లేదు.
 • మిగతా చోట్ల ఈవిఎం లు ధ్వంసం అయిన వీడియో లు ఈసి ఎందుకు బయట పెట్టడంలేదు.
 • మా పార్టీకి అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగాం.. గొడవలు జరిగినట్లు ఆరోపిస్తున్నచోట్ల టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదు..
 • మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
 • పల్నాడుతోపాటు రాష్ర్టంలో టిడిపి అరాచకాల వల్ల బాధితులైన వారికి పార్టీ తరపున అండగా నిలుస్తాం.
 • వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్నబిజేపితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లున్నాడు
 • సిఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలనే పచ్చమీడియా,టిడిపి కలసి టార్గెట్ తో రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు
 • ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారు. భయపెట్టి కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
 • పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా…? కారణాలు లేకుండా సిఎస్ ను తప్పించాలని ఫిర్యాదు చేస్తున్నారు
 • వారం తర్వాత రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ అవుతుందని భావిస్తున్నా. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత రాష్ర్టంలో ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలి మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ అవుతుందని భావిస్తున్నానని అన్నారు. ఎన్నికలలో పోలింగ్ రోజున టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు..మొత్తంగా చూస్తే ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించడం లేదని తెలిపారు.పార్టీఎంఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలీ, టీడీపీ, ఎల్లోమీడియా టెర్రిరిజం తదితర అంశాలకు సంబంధించి తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నల పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే….
పరీక్ష రాశాక వంద శాతం మార్కులు రావాలని టార్గెట్‌ పెట్టుకుంటాం. మేం పరీక్షలు అలాగే రాశాం. బెట్టింగుల కోసమో, సోషల్‌ మీడియాలో సర్క్యూలెట్‌ చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని మేం భావించడం లేదు. అలాంటి తాత్కాలిక ఆనందం మేం కోరుకోవడం లేదు. రాష్ర్టంలో ఎన్ డి ఏ అధికారంలోకి రానుందంటూ అమిత్ షా చేసిన కామెంట్స్ పై అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ బహుశా బీజేపీ వాళ్లు, అమిత్‌ షా నార్త్‌లో వారికి కలిసి వస్తుందని అనుకుంటున్న ఊహగానాల ప్రకారం మాకు(బిజేపికి) సౌత్‌లో బ్యాలెన్సింగ్‌ అవుతుందని అక్కడి ఓట్ల కోసం కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు