దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి సందర్భముగా మోపిదేవి మండలం మెరకనపల్లిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

భారత్ న్యూస్ మోపిదేవి

దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి సందర్భముగా మోపిదేవి మండలం మెరకనపల్లిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యములో నిర్వహించిన ఈ శిబిరాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడలు మండలి సాయిసుప్రియ ముఖ్య అతిధిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఆత్మీయ అతిధులుగా రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీ.ఎస్.ఎస్.బాలాజీ, జిల్లా కార్యదర్శి భవిరి శంకర్ నాధ్, జిల్లా కోశాధికారి కొండపల్లి రాం బాలాజీ విచ్చేసి శిబిరం నిర్వాహకులను అభినందించారు. ఈ శిబిరంలో హెచ్.సి.జి. క్యాన్సర్ హాస్పటల్ – డాక్టర్ గోపిచంద్ క్యాన్సర్ హాస్పిటల్, విజయవాడ సెంటిని హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి సలహాలు, సూచనలు అందించారు. శిబిరాన్ని రెడ్ క్రాస్ సభ్యులు, స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు.