భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు.. దివ్యాoగుడి కోసం పరుగులు పెట్టిన జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ..
బయట ఎండలో వేచివున్నాడని మీడియా వారు చెప్పిందే తడువుగా వచ్చి బాధితుడితో మాట్లాడిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ..
నడవలేని పరిస్థితిలో భూ సమస్య పరిష్కారం కోరుతూ రెవిన్యూ క్లినిక్ వచ్చిన బాధితుడు..
యనమదల గ్రామంలో ఉన్న 2 ఎకరాల 85 సెంట్ల తన పొలంలో 23 సెంట్లు కబ్జాకి గురైందని దివ్యాంగ వ్యక్తి డేగల శివ నాగరాజు తన ఆవేదనను కలెక్టర్ సాయి కాంత్ వర్మ ఎదుట వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గురై నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన తన భూ సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కి హాజరయ్యారు.

తనకున్న అనారోగ్య సమస్యతో పొలం అమ్మేందుకు సిద్ధం కాగా 23 సెంట్లు ఆక్రమణకు గురి కావడంతో సమస్య ఏర్పడిందన్నారు.
తక్షణమే జిల్లా అధికారులు స్పందించి తనుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాధితుడి ఆవేదనను అర్ధం చేసుకున్న కలెక్టర్ తక్షణమే ప్రత్తిపాడు ఏం.ఆర్.వో కి తెలిపి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని అదేశాలు జారీ చేశారు..