.భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు: వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సబ్ పల్లి రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1, 000 మెట్రిక్ టన్నుల గోదాంను ఆదివారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, పిఏసిఎస్ ఛైర్మన్ సత్తిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవి చందర్, తదితరులు ఉన్నారు.