భారత్ న్యూస్ గుంటూరు…జర్నలిస్టుల బస్సు పాస్‌లపై APSRTC కీలక ఆదేశాలు
జర్నలిస్టుల బస్సు పాస్‌ల అనుమతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన (గుంటూరు, పల్నాడు, బాపట్ల) జర్నలిస్టుల ‘జిల్లా పాస్‌ల’ను సూపర్ లగ్జరీ బస్సుల వరకు ఉచితంగా అనుమతించాల్సి ఉంటుంది.
అలాగే పల్నాడు జిల్లా జర్నలిస్టుల జిల్లా పాస్‌లను విజయవాడ వరకు కూడా ఉచితంగా అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ విషయాలను నోటీసు బోర్డులు మరియు గేట్ మీటింగ్‌ల ద్వారా సిబ్బంది అందరికీ తెలియజేయాలని పల్నాడు జిల్లా రవాణాధికారి కార్యాలయం మే 22, 2026న జారీ చేసిన ఈ నోటీసులో పేర్కొంది.
