భారత్ న్యూస్ హైదరాబాద్…చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
హైదరాబాద్ (చర్లపల్లి) నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి–తిరుపతి మధ్య కొత్త రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించింది.
గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన 07002/07031 సర్వీసును ఇకపై 17443/17444 నంబర్లతో శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.
తిరుపతి నుంచి ప్రతి గురువారం సా. 4:30 గంటలకు బయల్దేరి, చర్లపల్లికి మరుసటి రోజు ఉ. 8:25 గంటలకు చేరుకుంటుంది.

చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సా. 4:20 గంటలకు బయల్దేరి, తిరుపతికి శనివారం ఉ. 7:30 గంటలకు చేరుకుంటుంది.
ఈ సర్వీసులు మే 28, 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి.