భారత్ న్యూస్ రాజమండ్రి…వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!
AP: కర్నూలు(D) తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట మొదలైంది. రాయలసీమలో 2 రోజులుగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాల కోసం వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడి పొలాలకు తరలి వెళ్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ తలరాత మారుతుందనే ఆశతో ఫుడ్ క్యారేజీలతో సహా వచ్చి పొలాలను జల్లెడ పడుతున్నారు.
