భారత్ న్యూస్ విశాఖపట్నం..మహానాడు కార్యక్రమాలను జయప్రదం చేయండి: వీరంకి వెంకట గురుమూర్తి
హైబ్రిడ్ విధానంలో మహానాడు.. విజయవంతం చేయాలి:కనపర్తి
అవనిగడ్డ : రాబోయే మే 27, 28 తేదీలలో అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో గల 12 క్లస్టర్లలో నిర్వహించబోయే మహానాడు పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి భారీ ఎత్తున జయప్రదం చేయాలని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పిలుపునిచ్చారు.ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఇంధన కొరత దృష్ట్యా, అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు యువనేత నారా లోకేష్ ల ఆదేశాల మేరకు దేశంలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుందని పేర్కొన్నారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు గురుమూర్తి ఇక్కడికి విచ్చేసి మహానాడు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారని, ఏర్పాట్లపై ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ మహానాడు మహోత్సవంలో పాల్గొనడానికి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.ప్రస్తుత ఇంధన కొరత వంటి ఇబ్బందులు లేకపోయి ఉంటే ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించేవారమని శ్రీనివాసరావు తెలిపారు. అయితే, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు యువనేత నారా లోకేష్ ల ఆదేశాల మేరకు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈసారి క్లస్టర్స్ వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడును నిర్వహిస్తున్నాము కాబట్టి క్లస్టర్లలోనే కదా అని ఎవరూ నిరాశ చెందకుండా, మరింత ఉత్సాహంతో పాల్గొనాలి అని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి ,పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు